Monday, May 26, 2008

Tenali Ramakrishna - ధూర్జటి మీద ...

రాయలు వారు ధూర్జటి పద్యాలు గురించి
"స్తూతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పలుకులకు ఏల కలిగెనో అతులిత మాధురీ మహిమ".
అప్పుడు రామకృష్ణ ఇలా సెలవు ఇస్తాడు.
"ఆహా తెలిసెన్ , భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనత గన్తాపహారి సంతత మధురాధరోద్ధత సుధారస ధారల గ్రోలుటంజున్"
Here is an unbelievably sweet rendition by Ghantasala.

Tuesday, May 6, 2008

Tenali Ramakrishna పద్యాలు - కుంజర యూధము ...

ఇది సినిమాలో చూసి ఇక్కడ రాస్తునాను.
కుంజర యూధము దోమ కుతుకు జొచ్చెన్.
అంటే "ఏనుగుల గుంపు దోమ మెడలో చిక్కుకొన్నది" అని అర్థము. ఈ సమస్యను పూరించమని ద్వారక భటులు రామకృష్ణను అడుగుతారు. అయితే అతను ఇది భటులు ఇచ్చిన సమస్య కాదు అని గ్రహించి , ఇచ్చిన వారికి బుద్ధి చెప్పాలని ఇలా అంటాడు. "గంజాయి త్రాగి తురకల సంజాతము గూడి కల్లు చవి గోన్నావా , లంజలకొడక , ఎక్కడ కుంజర యూధము దోమ కుతుకు జొచ్చెన్". ఈ సమస్య వెనక వున్నా వారికి మంచి అక్షింతలే పడ్డాయి. కాని వారు అంతటితో ఊరుకున్నారా! వెళ్లి రాయల వారినీ సమస్య అడగమని చెప్తారు. సభలో రాయలు వారు ఇదే సమస్య రామకృష్ణకు ఇచ్చినప్పుడు అతడు దానిని ఇలా మార్చి చెబుతాడు.
"రంజన చెడి పాండవులరి భంజనులయి విరాట గొల్వు పాల్పడిరకట, సంజయా , విధినేమందును కుంజర యూధము దోమ కుతుకు జొచ్చెన్"