Thursday, March 19, 2009

Jalsa telugu song lyrics chalo re

చలోరే చలోరే చల్
ఈ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా
చంపనిదే బ్రతకవనీ , బ్రతికేందుకు చంపమనీ
నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారేటనీ
సంహారం సహజమనీ , సహవాసం స్వప్నమనీ
తర్కించే తెలివికి తెలిసేనా తానే శత్రువనీ

అప్పుడెప్పుడో ఆటవికం , ఇప్పుడేమో ఆధునికం
యుగయుగాలలోన మృగాలకన్నా ఇంక ఎమేదిగేము




gamyam song lyrics - enthavaraku

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడ్డక్కు
గమనమేది గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందీ గుర్తుపట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉందని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా...

rakhee song lyrics - kallalo kaalagni

కళ్ళలో కాలాగ్ని , గుండెల్లో జ్వాలాగ్ని
చేతుల్లో త్రేతాగ్ని, స్వాశిస్తే విషమాగ్ని

నీ యజ్ఞం మెచ్చి నింగి అక్షింతలు చల్లాలి
నీ పాదం తడిమి పుడమి తల్లి ముద్దు పెట్టాలి
తెలుగు తల్లి వీడే నా బిడ్డని గర్వించాలి
దేశ ఆడపడుచులింక నిర్భీతిగా బ్రతకాలి
నిన్ను చూసి మన దేశం జెండా తల ఎత్తాలి
జెండా నీ నుదుట ధర్మ చక్ర తిలకమద్దాలీ

Monday, May 26, 2008

Tenali Ramakrishna - ధూర్జటి మీద ...

రాయలు వారు ధూర్జటి పద్యాలు గురించి
"స్తూతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పలుకులకు ఏల కలిగెనో అతులిత మాధురీ మహిమ".
అప్పుడు రామకృష్ణ ఇలా సెలవు ఇస్తాడు.
"ఆహా తెలిసెన్ , భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనత గన్తాపహారి సంతత మధురాధరోద్ధత సుధారస ధారల గ్రోలుటంజున్"
Here is an unbelievably sweet rendition by Ghantasala.

Tuesday, May 6, 2008

Tenali Ramakrishna పద్యాలు - కుంజర యూధము ...

ఇది సినిమాలో చూసి ఇక్కడ రాస్తునాను.
కుంజర యూధము దోమ కుతుకు జొచ్చెన్.
అంటే "ఏనుగుల గుంపు దోమ మెడలో చిక్కుకొన్నది" అని అర్థము. ఈ సమస్యను పూరించమని ద్వారక భటులు రామకృష్ణను అడుగుతారు. అయితే అతను ఇది భటులు ఇచ్చిన సమస్య కాదు అని గ్రహించి , ఇచ్చిన వారికి బుద్ధి చెప్పాలని ఇలా అంటాడు. "గంజాయి త్రాగి తురకల సంజాతము గూడి కల్లు చవి గోన్నావా , లంజలకొడక , ఎక్కడ కుంజర యూధము దోమ కుతుకు జొచ్చెన్". ఈ సమస్య వెనక వున్నా వారికి మంచి అక్షింతలే పడ్డాయి. కాని వారు అంతటితో ఊరుకున్నారా! వెళ్లి రాయల వారినీ సమస్య అడగమని చెప్తారు. సభలో రాయలు వారు ఇదే సమస్య రామకృష్ణకు ఇచ్చినప్పుడు అతడు దానిని ఇలా మార్చి చెబుతాడు.
"రంజన చెడి పాండవులరి భంజనులయి విరాట గొల్వు పాల్పడిరకట, సంజయా , విధినేమందును కుంజర యూధము దోమ కుతుకు జొచ్చెన్"